గడపగడపకు వచ్చే వైఎస్సార్ సీపీ నాయకులను అధికారులను నిలదీయండి

-పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డి .రఫీ

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మూడు సంవత్సరాలుగాతాడేపల్లి కార్యాలయానికి బందీ అయిందని ఏనాడు ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయలేదని,ప్రజలపైచెత్త పన్ను ఇంటి పన్ను విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచిఅనేక భారాలు వేయటం వల్ల పెరిగిన అసంతృప్తిని తొలగించేందుకు గడప గడపకు వెళ్లాలని పార్టీ అధినాయకుడు పిలుపునిచ్చారని వచ్చే నాయకులను అధికారులను సమస్యలపైనిలదీయండని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డి.రఫీ విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం చేసింది నామ మాత్రమేనన్నారు. ఉద్యోగస్తులు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా లక్షల సంఖ్యలో విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. సి పి ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణచటానికి పోలీసు అణచివేతలతో హౌస్ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా! విభజన హామీలు! సాధించటంలో కేంద్రం నిధులు రాష్ట్రానికి తీసుకురావటంలో వైఫల్యం చెంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని కేంద్రానికి సరెండర్ అయ్యారని రఫీ ఎద్దేవా చేశారు. నవరత్నాలనిథులవేటలోకేంద్రం చుట్టూ కాళ్లరిగేలా అప్పులు కోసం తిరిగి “రుణ ఆంధ్రప్రదేశ్ చేశారన్నారు”.ఎస్టీ ఎస్సీ సబ్ప్లాన్ని నిధులుదారి మళ్లించారని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కరించేందుకు కార్పొరేషన్ పదవులు ఇచ్చి వారికి నిధులు కేటాయించలేదన్నారు. జగన్అనాలోచిత నిర్ణయాల వల్లరాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందు ఐపీఎస్, ఐఏఎస్ లను సైతం తల దించుకునేలా చేశారని రఫీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల స్థానిక సంస్థల అధికారాలను హరించే విధంగా వాలంటరీ వ్యవస్థ నెలకొల్పారని, నాటి జన్మభూమి కమిటీ లాగానే వాలంటీర్ వ్యవస్థ వై ఎస్ ఆర్ సి పి చేతిలో బందీ అయిపోయిందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో రాజకీయ వివక్షతతో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ అర్హత కలిగిన లబ్ధిదారులకు పథకాలు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని హరినాథ్ విమర్శించారు. హైకోర్టు సైతం వాలంటీర్ల నియామకాన్ని ప్రశ్నించిందన్నారు. ప్రజావేదిక కూల్చివేతనాటినుండి నేటి వరకు ప్రతిపక్షాన్ని కక్షపూరితంగా అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయన్నారు. అణిచివేతల ద్వారా ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకతను గుడ్డిగా అణగదొక్కాలని చూస్తే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని రఫీ హెచ్చరించారు. ఏ ప్రజలైతే అధికార పీఠం ఎక్కించారో అదే ప్రజలు తమ సమస్యలు పరిష్కరించకపోతే గద్దె దించుతారని రఫీ హెచ్చరించారు.