10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ నందు వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, గర్భిణీ స్త్రీలకు మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షులు బి మాధవ స్వామి, ప్రధాన కార్యదర్శి కె. సాంబశివుడు, రాష్ట్ర కౌన్సిలర్ నగిరి. శ్రీనివాసులు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి గారిని కోరారు. డిఈ ఓ గారికి ఇచ్చిన వినతి పత్రం లో పదవ తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే టప్పుడు ప్రశాంతంగా ఎటువంటి సమస్యలు లేని వాతావరణంలో మూల్యాంకనం చేయవలసి ఉన్నందున అనారోగ్యంతో బాధపడే వారికి, వృద్ధుల యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం వలన వృద్ధులకు మూల్యాంకనం నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే వికలాంగులకు మొదటి నుండి మినహాయింపు ఉన్నప్పటికీ వారికి కూడా మూల్యాంకనం కు హాజరు కావాలని ఉత్తర్వులు ఇవ్వడం వంటి వాటిని పరిశీలించి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం. పుల్లయ్య, మానపాటి రవి. రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ నందు మినహాయింపు ఇవ్వాలి -ఏపిటిఎఫ్
- Post published:May 11, 2022
- Post category:Nandyal