పర్సనల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ దరఖాస్తు గడువు పెంపు

పర్సనల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోర్సు పై ఆసక్తి ఉన్న అభ్యర్ధులకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో మే23 నుంచి జూన్ 21 వరకు గుంటూరు ఆచార్య సాగార్జున విశ్వవిద్యాలయంలో పర్సనల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ కోర్సు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలలోపు అభ్యర్ధులు మే 21వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని శాప్ విసి, ఏండి డా. యన్. ప్రభాకర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను శాప్ వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోని, ఈ saappayandpaly@gmail.com. మెయిల్ ఐడికి పంపగలరని తెలిపారు. ఇతర వివరాల కొరకు కోర్స్ కో-ఆర్డినేటర్ బి. శ్రీనివాస్ కుమార్ 8919642248, డా. కె.శ్రీధరరావు 9849600463 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.