నంద్యాల జిల్లాలోని బొమ్మలసత్రం వద్దగల ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి నిర్వహించారు. ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 66 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ఎస్పీ ప్రతి ఫిర్యాదిదారునితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలకు చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరం చూపాలని ఆదేశించారు. ఇందులో అస్థి తగాదాలు, కుటుంబ కలహాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చెయ్యడం మొదలగునవి ఉన్నాయన్నారు. స్పందన ఫిర్యాదులలో కొన్ని తనకు సంబందించిన స్థలాన్ని అక్రమంగా బెదిరించి వ్రాయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆర్.ఎస్ రంగాపురానికి చెందిన రామేశ్వరరెడ్డి, డబ్బులు తీసుకొని స్థలాన్ని ఫిర్యాదికి, మరొకరికి కూడా రిజిస్ట్రేషన్ చేయించాడని కోటవీదికి చెందిన వెంకటేశ్వర్లు, తన భర్త తనను వేధింపులకు గురిచేసి పుట్టింటికి పంపించి తనకు తెలియకుండా రెండవ పెళ్లి చేసుకున్నాడని తనకు న్యాయం చెయ్యాలని బెలుం శింగవరంకు చెందిన నాగలక్ష్మిలు ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, సిఐ జయరాములు పాల్గొన్నారు.

స్పందన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరం -జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి
- Post published:May 9, 2022
- Post category:Nandyal